close
Choose your channels

సెన్సార్ సన్నాహాల్లో 'ప్రేమంటే సులువు కాదురా'

Saturday, January 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ప్రేమంటే సులువు కాదురా`. సిమ్మీదాస్ హీరోయిన్. యువ ప్రతిభాశాలి చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. కృష్ణ మాదినేని సాహిత్యం సమకూర్చగా.. నందన్‌రాజ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా గీతాలు ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ మధుర ఆడియో` ద్వారా విడుదలై విశేష ఆదరణ పొందుతున్నాయి. "ప్రాణం" కమలాకర్ ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ చేయడం గమనార్హం. మొదటి కాపి సిద్ధం చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
ఈ సందర్భంగా......
దర్శకుడు చందా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. "కథ-కథనాలు, సంభాషణలు, పాటలు, నేపధ్య సంగీతం, హీరోహీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ "ప్రేమంటే సులువు కాదురా" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల కాలంలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్స్ లో "టాప్ టెన్" లో ఒకటిగా "ప్రేమంటే సులువు కాదురా" నిలుస్తుందనే నమ్మకం మాకుంది. "ప్రాణం" కమలాకర్ అందించిన నేపధ్య సంగీతం, ఉద్ధవ్ ఎడిటింగ్ సినిమాకు ప్రాణంగా నిలుస్తాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు మా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు" అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.