తల్లి పాత్రలో ప్రియాంక...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో నటించింది. కొన్నిరోజులు బాలీవుడ్‌కి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ బాలీవుడ్లో సినిమాలు చేయడానికి సమాయత్తమైంది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో `భరత్` అనే సినిమా చేస్తుంది. త్వరలోనే ఓ తల్లిపాత్రలో నటించబోతుంది. అది కూడా 18 ఏళ్ల కూతురికి తల్లిగా. 18 ఏళ్ల వయసులో ఏమ్నోడిఫిషియన్సీ వ్యాధితో తనువు చాలించిన అయేషా చౌదరి తల్లిగా ప్రియాంక తెరపై కనపడనుంది. సోనాలి బోస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. అయేషా చౌదరి పాత్రలో జైరా వసీమ్ నటించనుందని సమాచారం. ప్రియాంక చోప్రా భర్త పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments