close
Choose your channels

‘పుష్ప’ ఫిక్స‌య్యాడా!

Friday, May 22, 2020 • తెలుగు Comments

‘పుష్ప’ ఫిక్స‌య్యాడా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కరోనా ప్ర‌భావం లేక‌పోతే ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణను జ‌రుపుకోవాల్సిన ఈ చిత్రం ఆగింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌ల ప‌ర్మిష‌న్ కోసం సినీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం షూటింగ్‌ల‌కు ఓకే అంటే జులైలోనే రెగ్యుల‌ర్ షూటంగ్‌ను స్టార్ట్ చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంలో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బన్నీ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, ర‌గ్డ్ లుక్‌తో కనపడ్డారు. పూర్తి స్వ‌దేవీ సాంకేతిక‌త‌తో సినిమాను రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇప్ప‌టికే మ్యూజిక్ ట్యూన్స్‌ను సిద్ధం చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz