close
Choose your channels

'క్వీన్'.. దర్శకుడు మారుతున్నాడా?

Saturday, January 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2014లో హిందీలో వచ్చిన క్వీన్` సినిమా నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, మళయాళ భాషల్లో దర్శకుడు నీలకంఠ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హిందీలో క్వీన్`గా నటించిన కంగనా రనౌత్ పాత్రని తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమా మోహన్ పోషిస్తున్నారు.

తాజాగా తెలుగు వెర్షన్‌కి సంబంధించి ఫ్రాన్స్‌లో చిత్రీకరణని కూడా పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం.. ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమా చిత్రీకరణ విషయంలో నీలకంఠ, తమన్నాల మధ్య విబేధాలు తలెత్తడంతో నీలకంఠ ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ నుంచి రాలేదు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని...మను కుమరన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... మలయాళం వెర్షన్ కి సంబంధించి మాత్రం నీలకంఠ దర్శకుడిగా కొనసాగనున్నారని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.