close
Choose your channels

23.10.21 ... ఉదయం 11.16కి వీడనున్న విక్రమాదిత్య గుట్టు..!!

Thursday, October 21, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా పూజాహెగ్డే ఆడిపాడనున్నారు. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’, ‘గ్లిమ్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’, కొన్ని ప్రచార చిత్రాలు మినహాయించి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌లు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తూ.. ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ని బుధవారం ఉదయం చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రభాస్‌ పుట్టినరోజు కానుకగా అక్టోబర్‌ 23 శనివారం ఉదయం 11.16 గంటలకు రాధేశ్యామ్ టీజర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వివరించారు

1980 సమయంలో యూరప్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ ఇటలీలోనే జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత అలనాటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాతో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. కృష్ణంరాజు, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీ శర్మ, కునాల్‌రాయ్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, మిథున్‌, అనూమాలిక్‌, మనన్‌భరద్వాజ్‌(హిందీ), సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహాంస. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.