close
Choose your channels

‘లూసిఫ‌ర్’ రీమేక్‌‌లో రెహ‌మాన్‌

Tuesday, July 14, 2020 • తెలుగు Comments

‘లూసిఫ‌ర్’ రీమేక్‌‌లో రెహ‌మాన్‌

చిరు 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ర‌న్‌రాజార‌న్‌, సాహో చిత్రాల ద‌ర్శ‌కుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో నాలుగుపాత్ర‌లు క‌థ‌లో చాలా కీల‌కంగా ఉంటాయి. అందులో ఒకటి మోహన్‌లాల్ పాత్ర‌కు రైట్ హ్యాండ్‌గా ఉండే పృథ్వీరాజ్‌, మోహ‌న్‌లాల్ సోద‌రుడు పాత్ర‌లో పృథ్వీరాజ్ సోద‌రుడు ఇంద్ర‌క‌ర‌ణ్ న‌టించ‌గా, మోహ‌న్‌లాల్ సోద‌రి పాత్ర‌లో మంజు వారియ‌ర్‌, ఆమె భ‌ర్త‌, మెయిన్ విల‌న్‌గా వివేక్ ఒబెరాయ్ న‌టించారు. మ‌రి తెలుగు రీమేక్‌లో ఈ పాత్ర‌ల్లో ఎవ‌రు క‌న‌ప‌డ‌తార‌నే దానిపై సోష‌ల్ మీడియాలో రోజుకొక వార్త విన‌ప‌డుతోంది.

చిరు సోద‌రిగా సుహాసిని, ఖుష్బూ, రోజా వంటి సీనియ‌ర్ హీరోయిన్స్ పేర్లు విన‌ప‌డ్డాయి. సోద‌రి భ‌ర్త‌, మెయిన్ విల‌న్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేద‌ట‌. జ‌గ‌ప‌తిబాబు పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు విల‌న్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు రెహ‌మాన్ న‌టించ‌నున్నార‌ని అంటున్నారు. మ‌రి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz