close
Choose your channels

ఇది ఫుల్లీ రొమాంటిక్  'డర్టీ హరి'

Thursday, July 16, 2020 • తెలుగు Comments

ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెర‌కు పరిచయం చేసిన నిర్మాత ఎం.ఎస్.రాజు . ఆయ‌న దర్శకత్వంలో తెర‌కెక్కిన ట్రెండీ ఫిల్మ్ `డ‌ర్టీ హ‌రి`. ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు. `డ‌ర్టీ హ‌రి`లో శ్రవణ్ రెడ్డి హీరో. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ నాయిక‌లు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.

బ్లాక్‌ బ‌స్ట‌ర్ రికార్డుల‌ను క్రియేట్ చేసిన ఎం.ఎస్‌.రాజు చిత్రాలు... `శత్రువు`, `దేవి`, `మనసంతా నువ్వే`, `ఒక్కడు`, `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` వంటివ‌న్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఆయ‌న తెర‌కెక్కిస్తున్న `డ‌ర్టీ హ‌రి` మరో ఎత్తు. రొటీన్ కథలకు స్వ‌స్తి చెప్పి... నేటి యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న తెర‌కెక్కించిన సినిమా `డ‌ర్టీ హ‌రి`. మన నిత్యం క‌లిసే మనుషుల్లో దాగి ఉండే ఆటవికత్వం, విచక్షనారహిత్యం వంటి అంశాల చుట్టూ క‌థ న‌డుస్తుంది. క‌ఠోర‌మైన వాస్త‌వాల‌ను అంతే సున్నితంగా తెర‌కెక్కించారు ఎం.ఎస్‌.రాజు. ఓ వైపు విష‌యాన్ని చెబుతూనే క‌థ‌లో వినోదాన్ని కూడా అద్భుతంగా మేళ‌వించారు.

నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ ``మా `డర్టీ హరి` నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్త‌య్యాయి. రెండు నెల‌ల లాక్‌డౌన్ త‌ర్వాత ఇప్పుడు... విడుదలకి సిద్దంగా ఉంది. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాం .త్వరలో మా చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నాం`` అని అన్నారు

న‌టీన‌టులు: శ్రవణ్ రెడ్డి ,సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు.

Get Breaking News Alerts From IndiaGlitz