close
Choose your channels

రజనీకాంత్ '2.0' ట్రైలర్ ఎప్పుడంటే...

Sunday, March 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ ర‌జీనీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రోబో సీక్వెల్ 2.0 ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలను కూడా జ‌రుపుకుంటున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్‌పై శుభ‌క‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్ కూడా న‌టించింది. ఈ సినిమా టీజ‌ర్‌ను త‌మిళ సంవ‌త్స‌రాదిన విడుద‌ల చేయాల‌ని యూనిట్ స‌న్నాహాలు చేసింది. అయితే ట్రైల‌ర్‌ను విజ‌య‌ద‌శ‌మి రోజు అంటే సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. 2.0 త‌ర్వాత ర‌జనీకాంత్ క‌బాలి ఫేమ్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.