close
Choose your channels

జూన్ 1న 'రాజు గాడు' విడుదల

Saturday, May 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

 జూన్ 1 న రాజు గాడు విడుదల 

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న "రాజుగాడు" చిత్రం జూన్ 1 న విడుదల కానుంది. 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాలనందించిన సక్సెస్ఫుల్ బ్యానర్ నుండి వస్తుండటంతో చిత్రం భారీ ఆసక్తి నెలకొని ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంతో  సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. ఇటీవలే విడుదలైన మొదటి పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఆడియో లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ మే మూడవ వారంలో జరపనున్నారు.  

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.