close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్‌’లో ర‌కుల్ స్పెష‌ల్‌

Friday, May 29, 2020 • తెలుగు Comments

‘ఆర్ఆర్ఆర్‌’లో ర‌కుల్ స్పెష‌ల్‌

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్.. గోండు వీరుడు కొమురంభీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నిజమైన చారిత్ర‌క పాత్రల క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. రూ.400 కోట్ల‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ని, ఆ సాంగ్‌లో ర‌కుల్ ప్రీత్ న‌టించ‌నుంద‌ని.

‘ఆర్ఆర్ఆర్‌’లో ర‌కుల్ స్పెష‌ల్‌

ఈ సినిమాలో హీరోలైన తార‌క్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రితోనూ ర‌కుల్ ప్రీత్ సినిమాల్లో జ‌త క‌ట్టింది. మ‌రిప్పుడు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న వార్త‌ల మేర‌కు వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తోన్న చిత్రంలో ర‌కుల్ స్సెష‌ల్ సాంగ్ చేస్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. పాన్ ఇండియా చిత్రంగా వ‌చ్చే ఏడాదిన విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచ‌నాలున్నాయి. మోష‌న్ పోస్ట‌ర్‌, భీమ్ ఫ‌ర్ రామ‌రాజు వీడియోల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల జ‌న‌వ‌రి 8న విడుద‌ల కావాల్సిన ఆర్ఆర్ఆర్ మ‌రి కాస్త వెన‌క్కి వెళ్లేలానే క‌న‌ప‌డుతుంది.

Get Breaking News Alerts From IndiaGlitz