close
Choose your channels

నానికి జోడీగా రకుల్?

Wednesday, January 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేచుర‌ల్ స్టార్ నాని.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది ఈ మ‌ధ్య‌. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌తో మొద‌లెట్టి తాజాగా విడుద‌లైన ఎం.సి.ఎ వ‌ర‌కు వ‌రుస‌గా ఏడు విజ‌యాలు అందుకుని ప‌రిశ్ర‌మ దృష్టిని త‌న వైపుకు తిప్పుకున్నాడు నాని. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో కృష్ణార్జున యుద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. సీనియ‌ర్ క‌థానాయ‌కుడు నాగార్జున‌తో క‌లిసి నాని ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. భ‌లే మంచి రోజు, శ‌మంత‌క‌మ‌ణి చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత సి.అశ్వ‌నీద‌త్ నిర్మించ‌నున్నారు. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమాలో నానికి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.