Kiara Advani and Sidharth Malhotra:కియారా - సిద్ధార్ధ్ జోడికి RC15 టీమ్ సర్‌ప్రైజ్.. మీ ప్రేమకు థ్యాంక్స్ అంటూ కొత్త పెళ్లికూతురు పోస్ట్


Send us your feedback to audioarticles@vaarta.com


బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ- సిద్ధార్ధ్ మల్హోత్రాలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సూర్యగర్హ్ ప్యాలేస్‌లో వీరి విహహాం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, బంధు మిత్రులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు వీరి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కాగా.. ఆదివారం కియారా అద్వానీ-సిద్ధార్ధ్ మల్హోత్రాలు ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు తరలివచ్చారు.
పూలు జల్లుతూ శుభాకాంక్షలు తెలిపిన RC15:
ఇదిలావుండగా.. టాలీవుడ్ నుంచి వెళ్లాల్సిన ముఖ్యమైన వారు ఈ రిసెప్షన్‌కు హాజరుకాలేదు. ఇందులో రామ్‌చరణ్ తేజ్ దంపతులు, మెగా నిర్మాత దిల్‌రాజు, శంకర్ తదితరులు వెళ్లలేదు. ఈ క్రమంలో కియారా- సిద్ధార్ధ్ మల్హోత్రా జంటకు RC15 చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ జోడీకి యూనిట్ మొత్తం పూలు పట్టుకుని శుభాకాంక్షలు తెలుపుతూ, అంతా ఒకేసారి చల్లుతు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో రామ్‌చరణ్‌తో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్‌రాజు తదితరులు వున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కియారా అద్వానీ స్పందించారు. మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
చేతినిండా సినిమాలతో కియారా:
ఇక సినిమాల విషయానికి వస్తే.. తమిళ దర్శక దిగ్గజం శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న RC15లోనూ కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు... సిద్ధార్ధ్ అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ఇండియన్ పోలీస్ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ఇది ఆయనకు తొలి ఓటీటీ ప్రాజెక్ట్. కానీ రోహిత్ శెట్టి ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేశారు. అటు ‘‘ సత్యప్రేమ్ కి కథ’’ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తోంది. దీనికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
Team #RC15 #SVC50 wishes @SidMalhotra and @advani_kiara a very happy married life!
— Sri Venkateswara Creations (@SVC_official) February 13, 2023
Wishing you a lifetime of happiness, love and light❤
Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/GsppqJ8sgI
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.