close
Choose your channels

భారీ యాక్ష‌న్ సీన్ పూర్తిచేసిన చ‌ర‌ణ్‌

Saturday, May 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారీ యాక్ష‌న్ సీన్ పూర్తిచేసిన చ‌ర‌ణ్‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కియారా అద్వాని క‌థానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఇప్పటికే రెండు షెడ్యూళ్ళ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో రామ్ చరణ్ పాల్గొంటున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం.. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని రామ్ చరణ్ పై చిత్రీకరించినట్టు తెలిసింది. ఈ యాక్షన్ సీన్‌ను బోయపాటి స్టైల్‌లో కోలీవుడ్‌కు చెందిన స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌ కణల్ కన్నన్ పర్యవేక్షణలో చిత్రీకరించార‌ని స‌మాచారం. ప్రశాంత్, స్నేహ, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. కాగా.. ఇందులో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ ఓ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.