close
Choose your channels

ప్రభాస్‌కు చెర్రీ, రానా బర్త్ డే విషెస్ ఎలా చెప్పారంటే..!

Wednesday, October 23, 2019 • తెలుగు Comments

ప్రభాస్‌కు చెర్రీ, రానా బర్త్ డే విషెస్ ఎలా చెప్పారంటే..!

ఆరడగుల బుల్లెట్.. అందం, అభినయం ఆయనకే సొంతం.. తానే స్టార్ హీరో అని ఫీలింగ్ లేకుండా అందరితో కలిసిమెలిసి.. అభిమానులను డార్లింగ్ డార్లింగ్ అంటూ పలకరిస్తూ ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. నేడు ప్రభాస్ పుట్టిన రోజు. నేటితో టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.

ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వీరాభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా బాహుబలికి.. భల్లాలదేవ రానా దగ్గుబాటి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు విషెస్ చెప్పారు.

హ్యాపీ బర్త్‌డే సోదరా..!
‘పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా... నీ నవ్వు ఎప్పుడూ ఇలా నిష్కల్మషంగా ఉండాలి. లవ్ యూ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రానా రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా.. ఈ క్యాప్షన్‌కు గాను ప్రభాస్‌తో తాను ముచ్చటిస్తుండగా బాహుబలి నవ్వుతూ ఉన్న ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు. బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ ఇద్దరూ బ్రదర్స్‌గా నటించగా.. తాజాగా సోదరా.. అంటూ రానా విష్ చేయడం విశేషం. కాగా.. రానా విషెస్‌పై దగ్గుబాటి, యంగ్ రెబల్‌స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

హ్యాపీ బర్త్‌డే బ్యాడ్ బాయ్..!
‘బ్యాడ్ బాయ్.. హ్యాపీ బర్త్ డే.. లాట్స్ ఆఫ్ లవ్ యూ’ అంటూ ప్రభాస్‌ను ట్యాగ్ చేస్తూ చెర్రీ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. అంతేకాదు.. ప్రభాస్, తాను డ్యాన్స్ చేస్తున్న ఓ ఫొటోను జతచేసి షేర్ చేశాడు. కాగా.. వీరిద్దరితో పాటు పలువురు ప్రముఖులు సైతం ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz