close
Choose your channels

వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్

Sunday, May 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల వైజాగ్ లో జరిగింది. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. నేను శైలజ` ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి` రవికిశోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు. మే 15న సోమవారం రామ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రానికి సంబంధించిన డీటైల్స్ ను వెల్లడించారు.

ఈ సందర్భంగా...

నిర్మాత `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ `` నూతన సంవత్సరాది హేవిళంబిని పురస్కరించుకుని మేం ఈ సినిమాకు ముహూర్తాన్ని చేశాం. ఆ వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు రోజులు చిత్రీకరించాం. ఆ తర్వాత వైజాగ్ లో 11 రోజులు చిత్రీకరించాం. ఈ నెల 9 వరకు అక్కడే షూటింగ్ జరిగింది. కొంత టాకీ పార్ట్ తెరకెక్కించాం. ఈ నెల 26 నుంచి హైదరాబాద్ లో నాలుగైదు రోజుల పాటు మరో షెడ్యూల్ చేస్తాం. . ఆ తర్వాత జూన్ లో వైజాగ్, అరకులో కీలక పోర్షన్ ని తెరకెక్కిస్తాం. గతేడాది రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన నేను శైలజ`లో రామ్‌ను దర్శకుడు సరికొత్తగా చూపించారు. ఇప్పుడీ కొత్త చిత్రంలోనూ రామ్‌ లుక్, బాడీ లాంగ్వేజ్‌లను సరికొత్తగా చూపించనున్నారు`` అని తెలిపారు.

దర్శకుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ – మా హీరోగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను శైలజ`తో మా కాంబినేషన్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈ తాజా చిత్రం కోసం రామ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన లుక్ కి ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది. ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు`` అని అన్నారు.

యువ హీరో శ్రీవిష్ణు, పెళ్లి చూపులు` ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: సిరివెన్నెల` సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.​

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.