close
Choose your channels

Ramgopal Varma:ఓటుకు నోటు తీసుకోండి.. కానీ..: రాంగోపాల్ వర్మ

Wednesday, November 29, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా స్పెషల్‌నే. అయినా ఏ విషయం గురించి మాట్లాడినా అందులో తనదైన మార్క్ ఉంటుంది. తాజాగా తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లకు చేసిన రిక్వెస్ట్ కూడా వెరైటీగా ఉంది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ చిత్రకారుడు రమణరెడ్డి ఏర్పాటు చేసిన ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కార్టూన్‌ చిత్రాలను వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు గురించి తన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. ఓటు వేయాలంటూ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దని తాను చెప్పనని అయితే నోట్లు ఇచ్చిన నేతపై కృతజ్ఞత చూపాలనే ఆలోచన మాత్రం చేయకండని ఓటర్లకు సూచించారు.

డబ్బులు తీసుకున్నాననే కృతజ్ఞత చూపాలనుకోవడం మీకు మీరు చేసుకుంటున్న ద్రోహమని చెప్పారు. ఓటును కొనుక్కోవాలని చూడడం సదరు నేత చేసిన నేరమని నేరస్థుడిపై జాలి కానీ, కృతజ్ఞత కానీ చూపాల్సిన అవసరం లేదని హితవు పలికారు. మనకు అవసరం లేదు కాబట్టి మనం తీసుకోవట్లేదు కానీ అవసరం ఉన్న వారు తీసుకుంటారు.. అందులో తప్పేం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు తీసుకున్నా సరే మీకు మంచి చేసే వ్యక్తికి మాత్రమే ఓటేయండని ఆర్జీవీ వెల్లడించారు.

ఇక గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అయితే మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరిగి అభ్యర్థుల భవిష్యత్ తేలనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటింగ్ శాతం పెరిగేలా పోలీంగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.