close
Choose your channels

రానా ఘాజీ ట్రైలర్ రిలీజ్..!

Tuesday, January 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న భారీ చిత్రం ఘాజీ. ఈ చిత్రంలో రానా, తాప్సీ, క‌య్ క‌య్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్, పి.వి.పి సినిమా సంయుక్తంగా నిర్మించాయి. సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ భారీ చిత్రం టీజ‌ర్ ను రేపు రిలీజ్ చేయ‌నున్నారు. రేప‌టి నుంచి ఘాజీ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేట‌ర్స్ లో ఘాజీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నారు.
స‌బ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావ‌డం విశేషం. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. హాలీవుడ్ త‌ర‌హాలో హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్ప‌టి వర‌కు తెలుగు ప్రేక్ష‌కులు చూడ‌ని విధంగా ఉండేలా చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి అంటున్నారు చిత్ర‌యూనిట్. వైవిధ్యమైన క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ చేయ‌నున్నారు.
రానా, తాప్సీ, క‌య్ క‌య్ మీన‌న్, అతుల్ కుల‌క‌ర్ణి, ఓమ్ పురి, నాజ‌ర్, రాహుల్ సింగ్ త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి వి.ఎఫ్‌.ఎక్స్ - ఈవిఎ మోష‌న్ స్టూడియోస్, కాస్టూమ్స్ డిజైన‌ర్ అశ్వ‌నాత్ బైరి, స్టంట్స్ - జాషువ‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ - శివ‌మ్ రావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కె, ఎడిట‌ర్ - ఎ శ్రీక‌ర్ ప్ర‌సాద్, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫి - మ‌ది, అడిషిన‌ల్ స్టోరీ & స్ర్కీన్ ప్లే - నిరంజ‌న్ రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ & పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ - ఎన్.ఎం. పాషా, ప్రొడ్యూస‌ర్స్ ఆఫ్ మ్యాట్నీ - అన్వేష్ రెడ్డి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, ప్రొడ్యూస‌ర్స ఫ‌ర్ పి.వి.పి సినిమా - పేర‌ల్ వి పొట్లూరి, ప‌ర‌మ్ వి పొట్లూరి, క‌విన్ అన్నే, స్టోరీ, స్ర్కీన్ ప్లే & డైరెక్ష‌న్ - సంక‌ల్ప్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.