close
Choose your channels

రానా ఘాజీ ట్రైలర్ అదిరింది..!

Wednesday, January 11, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాజీ. ఈ చిత్రానికి సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో తాప్సీ, కె.కె.మీన‌న్, అతుల్ కుల‌క‌ర్ణి, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ భారీ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో నిర్మించింది. యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేయ‌డం కాదు...శ‌త్రువు ప్రాణాలు తీయ‌డం అనే డైలాగ్ తో ఈ ట్రైల‌ర్ స్టార్ట్ అయ్యింది.
1971 ఇండియా - పాకిస్థాన్ యుద్ధానికి ముందు జ‌రిగిన య‌ద్ధార్ధ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో రానా భార‌త జ‌లాంత‌ర్గామి ఆఫీస‌ర్స్ లో ముఖ్య‌మైన ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. భార‌త యుద్ధ‌నౌక‌ను ధ్వంసం చేసే ల‌క్ష్యంతో పాకిస్ధాన్ కు చెందిన జ‌లాంత‌ర్గామి భార‌త జ‌లాల్లోకి ప్రవేశిస్తుంది. పాక్ జ‌లాంత‌ర్గామిని ఎలా ఎదుర్కొన్నారు అనేది చాలా ఉత్కంఠ‌గా ఉండేలా తెర‌కెక్కించారు అనిపిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.