close
Choose your channels

ఇన్‌టెన్స్ లుక్‌తో ఆక‌ట్టుకుంటున్న రానా

Saturday, December 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`బాహుబ‌లి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయ‌న `విరాట ప‌ర్వం` సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

శ‌నివారం(డిసెంబ‌ర్ 14న‌) రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా విరాట ప‌ర్వం సినిమాకు సంబంధించి ఇన్‌టెన్స్ లుక్‌ను విడుద‌ల చేశారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఈ లుక్‌లో రానా ముఖానికి ఎర్ర‌టి గుడ్డ‌ను క‌ట్టుకుని ఉన్నాడు. రానా పాత్ర‌పై సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు విన‌ప‌డ్డాయి. రానా న‌క్స‌లైట్‌గా క‌న‌ప‌డ‌తాడ‌ని, పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడ‌ని ఇలా చాలా వార్త‌లు వినిపించాయి. `రెవల్యూష‌న్ ఈజ్ ఎన్ యాక్ష‌న్‌` అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాలో ఉన్న ఇన్‌టెన్స్‌ను పోస్ట‌ర్‌లో ఎలివేట్ చేస్తున్నారు.

సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. సాయిప‌ల్ల‌విపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇప్పుడు రానాపై సన్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంది. ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. `నీది నాది ఒకే క‌థ‌` ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.