close
Choose your channels

2.0 లో రానా దగ్గుబాటి

Thursday, October 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2.0 లో రానా దగ్గుబాటి ఏంటి అనుకుంటున్నారా... ? సినిమా లో కాదండి.. రేపు జరగబోయే ఆడియో ఫంక్షన్ లో.

రజనీకాంత్-అక్షయ్ కుమార్- శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం 2.0. అయితే ఈ చిత్ర ఆడియో ని కనీ వినీ ఎరుగని రీతిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఆడియో ని రేపు దుబాయ్ లోని బుర్జ్ పార్క్ హోటల్ లో రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు రానా హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

12వేల మంది ఈ వేడుకను ఉచితంగా తిలకించే అవకాశమున్న ఈ ఆడియో ఫంక్షన్ లో ఏఆర్ రెహ్మాన్ లైవ్ కంపోసింగ్, బాస్కో డ్యాన్స్‌ బృందం ఆటపాట తో పాటు మరెన్నో కార్యక్రమాలను ప్లాన్ చేసారు.

వేడుకకు ముఖ్య అతిథిగా దుబాయ్‌ రాజు రానుండటం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.