close
Choose your channels

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న రానా

Sunday, December 29, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న రానా

రానా దగ్గుబాటి.. పర్ఫెక్షన్ కోసం ఆరాటపడే నటుడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడానికి తాపత్రయ పడుతుంటాడు. బాహుబలి సినిమానే దీనికి పెద్ద ఉదాహరణ. ఆ సినిమాలో భల్లాలదేవ పాత్ర కోసం పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేశాడు. శరీర దారుఢ్యం నుంచి మొదలుకొని హావభావాల వరకు అన్నిటా.. పర్ఫెక్షన్ను చూపించాడు.

రానా ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. రైఫిల్ షూటింగ్ నుంచి పోలీస్ పనితీరు వరకు ప్రతిదాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాడట. సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేస్తున్నాడట. ఓ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో రానా తర్ఫీదు పొందుతున్నాడని తెలిసింది. నక్సల్స్ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎక్కువగా అటవీ ప్రాంతంలో షూట్ చేస్తున్నారు. వికారాబాద్, కేరళ అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. వికారాబాద్‌లో పదిరోజుల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ ఒకటి షూటింగ్ చేయనున్నారట. ఈ ఎపిసోడ్ చాలా కీలకమైనది చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కీలక పాత్ర పోషిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.