close
Choose your channels

'యానిమల్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Thursday, January 25, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసి రణ్‌బీర్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే కొంతమంది సినిమా సూపర్‌గా ఉందంటూ మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం సినిమాలో వయెలెన్స్, రొమాన్స్ మోతాదుకు మించి ఉందని తీవ్ర విమర్శలు చేశారు. అయినా కానీ సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది.

తండ్రి సెంటిమెంట్‌ను సందీప్.. తనదైన స్టైల్‌లో సరికొత్తగా ప్రెజెంట్ చేసిన విధానం యువతను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్‌గా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. సినిమా విడుదలై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఓటీటీలో మరో 8 నిమిషాల అదనపు సీన్స్‌తో స్ట్రీమ్ కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఆ సీన్‌లు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు అభిమానులకు శుభవార్త అందింది.

యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ డేట్‌ అనౌన్స్ చేసింది. ఈ మూవీని రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే స్ట్రీమింగ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం థియేటర్లో సినిమా మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు అర్థరాత్రి నుంచి చూసేయండి.

ఇక సందీప్ రెడ్డి తదుపరి సినిమాల విషయానికొస్తే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది. భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మించనున్నారు. దీంతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు. ప్రభాస్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. మొత్తానికి వరుస సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడు.

 
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.