close
Choose your channels

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.... శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

Sunday, September 11, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.... శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అలనాటి నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం నుంచే కృష్ణంరాజు ఆరోగ్యం విషమించింది. ఈ క్రమంలో తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెబల్ స్టార్ మరణంతో తెలుగు చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య శ్యామలా దేవి, కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి వున్నారు. కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రేపు ఉదయం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.... శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

ఇదీ ప్రస్థానం :

1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. విద్యాభ్యాసం తర్వాత సినిమాలపై ఆసక్తితో ‘చిలకా గోరింకా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా నటించి తన నటనతో మెప్పించారు. రెండు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ , ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం వరించింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, కటకటాల రుద్రయ్య, అమరదీపం, సతీ సావిత్రి, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, టూ టౌన్ రౌడీ వంటి సినిమాలు విశేష ప్రజాదరణ పొందాయి. అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో సమానంగా కృష్ణంరాజుకు అభిమాన గణం వుండేది. హీరోగా నటిస్తూనే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతగానూ ఉత్తమ చిత్రాలను నిర్మించారు.

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.... శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

రాజకీయ రంగ ప్రవేశం :

రాజకీయాలపై మక్కువతో 1991లో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు కృష్ణంరాజు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం స్థానం నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్ధి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో కొద్దికాలం పాటు రాజకీయాలకు దూరంగా వున్న ఆయన 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నర్సాపురం నుంచి పోటీచేసి గెలుపొంది నాటి వాజ్‌పేయ్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో పార్టీలో చేరి రాజమండ్రి లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.