close
Choose your channels

‘వకీల్ సాబ్’ ట్రైలర్ పై స్పందించిన రేణు దేశాయ్

Wednesday, March 31, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘వకీల్ సాబ్’ ట్రైలర్ పై స్పందించిన  రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌ను కంప్లీట్ చేస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బేవ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్‌ రాజ్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర కీలకపాత్రల్లో నటించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

ఈ ట్రైలర్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ ట్రైలర్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. అయితే ఈ ట్రైలర్‌ను చూసిన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. దీనిపై స్పందించారు. ట్రైలర్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడని.. ఇప్పటి వరకు చూడని పవర్ స్టార్ స్క్రీన్‌పై కనిపించాడని రేణు దేశాయ్ తెలిపారు. ముఖ్యంగా ట్రైలర్‌లో పవన్ ఆటిట్యూడ్ అదిరిపోయిందని ఆమె ప్రశంసించారు. అలాగే అమ్మాయి తరఫున.. నిలబడి పోరాడే న్యాయవాది పాత్రలో పవన్ నటన అద్భుతమన్నారు. న్యాయం కోసం పోరాడే పాత్ర పవన్‌కు చాలా బాగా సూట్ అవుతుందన్నారు.

ముఖ్యంగా ‘మీరు వర్జినా?’ అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుందని.. మొదటి నుంచి చివరి వరకు కూడా వకీల్ సాబ్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని రేణు దేశాయ్ తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా అందర్నీ అలరిస్తుందని ఆమె తెలిపారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.