close
Choose your channels

ప్ర‌కాష్ రాజ్ గురించి వ‌ర్మ క్లారిటీ

Wednesday, October 11, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ఆ పాత్ర మ‌రెవ‌రిదో కాదు. ఆంధ్రుల ఆరాధ్య నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌. ఇంత‌కు ఈ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నే విష‌యాన్ని ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు...వివాదాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్‌తో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న నేప‌థ్యంలో..ప్ర‌కాష్‌రాజ్ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ వార్త‌ల‌ పై వ‌ర్మ స్పందించాడు. అలాంటిదేం లేద‌ని వ‌ర్మ త‌న ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. న‌టి, ఎమ్మెల్యే రోజా..ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారని స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఫిభ్ర‌వ‌రిలో సినిమాను ప్రారంభించి అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేసేలా వ‌ర్మ ప్లాన్ చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ధృవీకరించారు కూడా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.