close
Choose your channels

RRR అప్డేట్: రై రై మంటూ రిలీజ్ వైపుకు అల్లూరి, కొమరం భీం

Tuesday, June 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దర్శకధీరుడు రాజమౌళి తీర్చిదిద్దుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పండగ లాంటి వార్త. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీపై దేశ వ్యాప్తంగా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

తాజా చిత్ర యూనిట్ మూవీ షూటింగ్ స్టేటస్ రివీల్ చేసింది. కేవలం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు ప్రకటించారు. ఆ పాటలని కూడా వేగంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. రాంచరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేశారట. మిగిలిన భాషల్లో కూడా డబ్బింగ్ త్వరలోనే పూర్తి కానుంది.

ఇదీ చదవండి: ఉత్కంఠ పెంచుతున్న 'క్రిష్ 4' కథాంశం!

షూటింగ్ అప్డేట్ అందిస్తూ అందమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, రాంచరణ్ బైక్ పై జాలిగా రైడింగ్ లో ఉన్నారు. రాంచరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రం రెండుసార్లు విడుదల వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ పూర్తి కావస్తుండడంతో త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ భామ అలియా భట్.. రాంచరణ్ కు జోడిగా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తోంది.

అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరూ అజ్ఞాతంలో ఉన్న టైంలో కలుసుకుని స్నేహితులుగా మారి ఉంటే ఎలా ఉంటుంది అనే కల్పితమైన పాయింట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తుండగా, సముద్రఖని కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.