close
Choose your channels

జోనర్‌ విషయంలో క్లారిటీ ఇచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌

Sunday, October 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జోనర్‌ విషయంలో క్లారిటీ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

దర్శకుధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌’. ఈ ఫిక్ష‌నల్ పీరియాడిక‌ల్ డ్రామాలో కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గానే రీస్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అక్టోబర్‌ 10న డైరెక్టర్‌ రాజమౌళి పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ఓ నాణెంలో రెండు చేతులు పట్టుకున్న ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోపై నెటిజన్స్‌ తమదైన శైలిలో కామెంట్స్‌ చేయడం మొదలుపెట్టారు. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు కలిసి బ్రిటీష్‌వారిపై స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే సినిమా ఇదని అన్నారు.

జోనర్‌ విషయంలో క్లారిటీ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

అయితే దీనిపై ట్రిపులార్‌ యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. "కొమురం భీమ్‌, అల్లూరి పాత్రలు సినిమాలో కలుసుకుంటాయని విడుదల చేసిన ఫొటోలో ఉండేవి వారి చేతులే. అయితే ఇది ఫిక్షనల్‌ మూవీ. అంతే తప్ప దేశభక్తి చిత్రం కాదు" అని మెసేజ్‌ను షేర్‌ చేయడంతో ట్రిపులార్‌ జోనర్‌ విషయంలో క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. రెండు నెలల పాటు ఈ షెడ్యూల్‌ షూటింగ్ ఉంటుంది. ఈ షెడ్యూల్‌లో ఆలియాభట్‌ కూడా భాగం అవుతుందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos