close
Choose your channels

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత థియేట‌ర్‌లో 'సాహో'

Friday, August 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత థియేట‌ర్‌లో సాహో

ప్ర‌స్తుతం తెలుగు సినిమా రంగం వైపు ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌లు వారు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. డిఫ‌రెంట్ చిత్రాలు రూపొందుతున్నాయి. ప్ర‌పంచ స్థాయి సాంకేతిక నిపుణులు `సాహో` సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగ‌స్ట్ 30న సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో భారీగా విడుద‌ల‌కానుంది. ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, మందిరా బేడి, చంకీ పాండే, నీల్ నితిన్‌, అరుణ్ విజ‌య్ వంటిస్టార్స్ ఈ చిత్రంలో న‌టించారు. ఈ సినిమా టీజ‌ర్ రీసెంట్‌గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు విడుద‌ల‌కు ముందే అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది. అదేంటంటే.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత థియేట‌ర్ గ్రాండ్ రెక్స్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అధునాత‌న వ‌స‌తులున్న ఈ థియేట‌ర్‌లో ఒకేసారి 2800 సినిమా వీక్షించ‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాది చిత్రాలు క‌బాలి, బాహుబ‌లి, మెర్స‌ల్‌, విశ్వ‌రూపం 2ల‌ను మాత్ర‌మే గ్రాండ్ రెక్స్‌లో ప్ర‌ద‌ర్శించారు. తాజాగా ఇప్పుడు ఈ వ‌రుస‌లో `సాహో` కూడా జాయిన‌య్యింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.