close
Choose your channels

సెప్టెంబర్ 2న 'సిద్ధార్థ' ఆడియో

Monday, August 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లంకాల బుచ్చిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో సాగ‌ర్‌, రాగిణి నంద్వాణి, సాక్షిచౌద‌రి హీరో హీరోయిన్లుగా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కె.వి.ద‌యానంద్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం `సిద్ధార్థ‌`. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాల తుది ద‌శ‌కు చేరుకున్నాయి. సెప్టెంబ‌ర్ 2న ఆడియో విడుద‌ల కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ...

దాస‌రి కిర‌ణ్‌కుమార్ మాట్లాడుతూ `` మంచి టీంతో చేస్తున్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సిద్ధార్థ‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విస్సుగారు అందించిన సూప‌ర్బ్ క‌థ‌లో మంచి ఎంట‌ర్ టైనింగ్‌తో పాటు ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్‌కు త‌గిన విధంగా సాగ‌ర్ ఎక్సలెంట్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. సినిమాలో కంటెంట్‌కు త‌గిన విధంగా పరుచూరి బ్ర‌ద‌ర్స్ అద్భుత‌మైన డైలాగ్స్ అందించారు. మెలోడి బ్ర‌హ్మ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హిస్తున్నాం. ఈ కార్యక్ర‌మంలో పలువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్‌లోనే మూవీని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.