close
Choose your channels

ఆది కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ చుట్టాలబ్బాయి - సాయికుమార్

Saturday, August 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది, న‌మిత ప్ర‌మోద్ జంట‌గా వీర‌భ‌ద్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రాన్నివెంక‌ట్ తలారి, రామ్ త‌ల్లూరి సంయుక్తంగా నిర్మించారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన చుట్టాల‌బ్బాయి చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శితమౌతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ లో
సాయికుమార్ మాట్లాడుతూ.... చుట్టాలబ్బాయి చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా 350 ధియేట‌ర్స్ రిలీజ్ చేసాం. ఆది కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఫ‌స్టాఫ్ లో కామెడీ...సెకండాఫ్ లో సెంటిమెంట్ బాగుంది. ఆది చాలా స్టైలీష్ గా ఉన్నాడు అని చెబుతున్నారు. హీరోయిన్ న‌మితకి ఫ‌స్ట్ మూవీ అయిన‌ప్ప‌టికీ బాగా న‌టించింది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా వీర‌భ‌ద్ర‌మ్ ఈ చిత్రాన్ని చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ అన్నారు.
డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ మాట్లాడుతూ... టీజ‌ర్ రిలీజ్ చేసిన‌ప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో అని కాస్త టెన్ష‌న్ ప‌డ్డాను. కానీ...టీజ‌ర్ చూసిన త‌ర్వాత బిజినెస్ అవ్వ‌డంతో సినిమా పై మ‌రింత న‌మ్మ‌కం పెరిగింది. మా న‌మ్మ‌కానికి త‌గ్గ‌ట్టు మంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తుంది. రిలీజ్ అయిన అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ అవ్వ‌డం ఆనందంగా ఉంది.సాయికుమార్ గారి క్యారెక్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా నిర్మాత‌లు ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అహ‌నా పెళ్లంట‌, పూల రంగ‌డు చిత్రాల వ‌లే చుట్టాల‌బ్బాయి కూడా పెద్ద విజ‌యం సాధిస్తుంది అన్నారు.
నిర్మాత వెంక‌ట్ మాట్లాడుతూ... మా చుట్టాల‌బ్బాయి చిత్రానికి మార్నింగ్ షో నుంచి మంచి టాక్ వ‌చ్చింది. అన్ని ఏరియాల్లో మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. అందుక‌నే మ‌రో 50 ధియేట‌ర్స్ ను పెంచుతున్నాం. సినిమా చూస్తుంటే... న‌మిత న‌ట‌న‌కు క‌ళ్లంట నీళ్లు వ‌చ్చాయి. తొలి చిత్రం అయిన‌ప్ప‌టికీ న‌మిత పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా బాగా న‌టించింది. మా చుట్టాల‌బ్బాయి చిత్రం ఫ‌స్ట్ డే 2.5 కోట్లు గ్రాస్ వ‌సూలు చేసింది. మూడు రోజుల్లోనే మా పెట్టుబ‌డి వ‌చ్చేస్తుంది అనే న‌మ్మ‌కం ఉంది అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ.... ఈ చిత్రంలో ఆది డ్యాన్స్ చాలా బాగా చేసాడు. సాయికుమార్, ఆది క‌లిసి న‌టించిన ఓ సీన్ లో పి.జె శ‌ర్మ గారు క‌నిపించారు. ఆయ‌న ఆశీస్సులు వ‌ల‌నే చుట్టాల‌బ్బాయి మంచి విజ‌యం సాధిస్తుంది అనుకుంటున్నాను. సాయికుమార్, ఆది క‌లిసి మ‌రో సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ న‌మిత మాట్లాడుతూ... ఓ మంచి చిత్రం ద్వారా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా ఉంది. అలాగే నా తొలి చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చినందుకు హ్యాపీగా ఫీల‌వుతున్నాను. ఈ చిత్రాన్ని ఆద‌రించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ... మంచి ఓపెనింగ్స్ వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా స్టైలీష్ గా కనిపించాను అని చెబుతున్నారు. న‌న్ను అందంగా చూపించిన సినిమాటోగ్రాఫ‌ర్ అరుణ్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. నాన్న‌తో ఫ‌స్ట్ టైమ్ క‌లిసి న‌టించ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. మా నిర్మాత‌ల‌కు ఇది ఫ‌స్ట్ ఫిల్మ్ అయిన‌ప్ప‌టికీ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మా చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని బిగ్ హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో న‌టులు గిరిధ‌ర్, చంద్ర‌, సినిమాటోగ్రాఫ‌ర్ అరుణ్, డిస్ట్రిబ్యూట‌ర్ రాకేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.