close
Choose your channels

సాయిప‌ల్ల‌వి అక్క‌డ కూడా..

Wednesday, September 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫిదా చిత్రంతో తెలుగువారికి ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి సాయి పల్ల‌వి. అంత‌కుముందు ప్రేమ‌మ్‌, క‌లి అనే మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించిన‌ సాయిప‌ల్ల‌వికి ఫిదాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఈ చిత్రంలో తెలంగాణ పోరి భానుమ‌తిగా న‌టించిన ప‌ల్ల‌వి.. త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుని అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌.. తెలుగు, త‌మిళ భాషల్లో రూపొందుతున్న క‌ణం చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. త‌మిళంలో క‌రు పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి నాలుగేళ్ల చిన్నారికి త‌ల్లిగా క‌నిపించ‌నుంది.

ఎబార్ష‌న్ అనే అంశం చుట్టూ తిరిగే ఈ సినిమాకి త‌మిళ వెర్ష‌న్‌లో తానే డ‌బ్బింగ్ చెప్పుకోనుంది. ఇప్ప‌టికే మ‌ల‌యాళం, తెలుగు భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పుకుని స‌క్సెస్ అయిన సాయిప‌ల్ల‌వి.. త‌మిళంలోనూ అది కంటిన్యూ చేయ‌నుంద‌న్న మాట‌. ఆల్ ది బెస్ట్ సాయిప‌ల్ల‌వి!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.