close
Choose your channels

సామ‌జ వ‌ర‌గ‌మ‌న .. నిను చూసి ఆగ‌గ‌ల‌నా !

Saturday, September 28, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నీ కాళ్ల‌ను ప‌ట్టుకు వ‌ద‌ల‌న‌న్న‌వి చూడే నా క‌ళ్లు..
ఆ చూపుల‌న‌లా తొక్కుతూ వెళ్ల‌కు ద‌య‌లేదా అస‌లు
నీ క‌ళ్ల‌కు కావాలి కాస్త కాటుక‌లా నా క‌ల‌లు
నువ్వు నులుముతుంటే ఎర్ర‌గకంది చిందేనే సెగ‌లు
నా ఊపిరి గాలికి ఊయ్యాల‌లుగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టెస్తే అలా నిట్టూర్చ‌వ‌టే నిట్ఠుర‌పోవే విల విల‌లు
సామ‌జ వ‌ర‌గ‌మ‌న .. నిను చూసి ఆగ‌గ‌ల‌నా !

అంటూ ప్రేయ‌సి పూజా హెగ్డేని ప్ర‌స‌న్నం చేసుకుంటున్నాడు హీరో బ‌న్నీ. ఈ క్ర‌మంలో ఆయ‌న పాడిన పాటే ఇది. అస‌లు బన్నీ ఎందుకీ పాట పాడాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. `అల వైకుంఠ‌పురములో..` సినిమాలోనీ మెలోడీ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ పాడ‌గా, త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. శనివారం విడుదలైన ఈ పాట‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది.

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ట‌బు కీల‌క పాత్ర పోషిస్తుంది. జ‌య‌రాం, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ కోటీశ్వ‌రుడి బిడ్డ పేద‌వాడుగా, పేద‌వాడి కొడుకు కోటీశ్వ‌రుడిగా పెరుగుతారు. త‌ద‌నంత‌ర ప‌రిస్థితులు ఎలా మారుతాయ‌నేదే ఈ సినిమా క‌థాంశమ‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న బ‌న్ని ఈ సినిమాను చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.