close
Choose your channels

'సమ్మోహనం' ఆ సినిమాకి స్ఫూర్తినా?

Saturday, May 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘సమ్మోహనం’ ఆ సినిమాకి స్ఫూర్తినా?

యువ కథానాయకుడు సుధీర్ బాబు, బాలీవుడ్ భామ అదితిరావ్ హైదరి జంటగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోందీ చిత్రం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి  టీజర్‌ను ఆవిష్కరించడ‌మే కాకుండా.. స‌ద‌రు టీజ‌ర్‌పై ప్రశంసల జల్లు కురిపించడంతో ఈ సినిమాకి చెప్పుకోద‌గ్గ హైప్ వచ్చింది.

అయితే.. ఈ సినిమా టీజ‌ర్‌ చూసిన వాళ్ళు మాత్రం దీన్ని ఓ బ్రిటిష్ ఫిల్మ్‌తో పోల్చి చూస్తున్నారు. కాస్త  వివరాల్లోకి వెళితే.. 1999లో రోజర్ మిచెల్ డైరెక్షన్లో జూలియా రోబెర్ట్స్, హ్యూ గ్రాంట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రిటిష్ ఫిల్మ్ ‘నోట్టింగ్ హిల్’. రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకున్న ఈ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఆధారంగానే స‌మ్మోహ‌నం రూపొందింద‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని హీరో సుధీర్ బాబు కొట్టి పడేస్తున్నారు. దర్శకుడు ఇంద్రగంటి ‘గోల్కొండ హై స్కూల్’ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథను రాసుకున్నారనీ.. అది ఇప్పుడు తెరకెక్కించారని ఆయ‌న చెబుతున్నారు. అయితే.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. జూన్ 14వరకు వేచి ఉండాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.