close
Choose your channels

అక్షయ్ కుమార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన సత్యదేవ్

Wednesday, March 31, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్షయ్ కుమార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన సత్యదేవ్

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సూపర్ సక్సెస్‌తో లాక్‌డౌన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్.. తన స్టార్ డమ్‌ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఆయన సాదించిన సక్సెస్‌తో ఎన్నో ప్రాజెక్టులు ఆయనను వెదుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ఆయనొక బిజీ హీరోగా మారిపోయాడు. సత్యదేవ్ నటించిన ‘తిమ్మరసు’, గుర్తుందా శీతాకాలం, గాడ్సే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు.. సత్యదేవ్ బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ ఒక ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఒక పాత్రను సత్యదేవ్ పోషించబోతున్నట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సత్యదేవ్‌కు దక్కిన అద్భుతమైన అవకాశమని తెలుస్తోంది. ఇటీవల ఆయన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతోనే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లూసిఫర్’లో సైతం ఆయనకు నటించే అవకాశం లభించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment