close
Choose your channels

Seethakka: టీపీసీసీ చీఫ్ రేసులో సీతక్క.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించేనా..?

Saturday, May 25, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Seethakka: టీపీసీసీ చీఫ్ రేసులో సీతక్క.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించేనా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చొబెట్టింది. ఆయన సారథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్లింది. దీంతో ఇప్పటిదాకా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చెప్పిన నేపథ్యంలో ఆ పదవికి వేరే నాయకుడిని నియమించేందుకు హైకమాండ్ యోచిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షున్ని మార్చనున్నట్టు అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించగా.. ఆ పదవి కోసం ఆశవాహులు పైరవీలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

టీపీసీసీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు సీనియర్లు చాలా మంది పోటీలో ఉన్నారు. అయితే అనూహ్యంగా మంత్రి సీతక్క పేరు తెరమీదికి వచ్చింది. అయితే ఈ పదవి కోసం పోటీపడుతున్న సీనియర్లను కాదని.. కొత్తగా పార్టీలోకి వచ్చి మంత్రి పదవి దక్కించుకున్న సీతక్కకు అధిష్ఠానం ఈ పదవి ఇస్తుందా అనే సందేహం నెలకొంది. ఒకవేళ పదవి ఇస్తే మాత్రం టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి ఆదివాసి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల 21 నాటికి మూడేళ్లు పూర్తవుతాయి.

Seethakka: టీపీసీసీ చీఫ్ రేసులో సీతక్క.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించేనా..?

రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టాక అట్టడుగు స్థాయి నుంచి అధికారంలోకి పార్టీ వచ్చింది. ఈ ఘటన తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఏఐసీసీకి దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో పీసీసీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా కీలకం కానుంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌ గౌడ్ పీసీసీ చీఫ్ పోస్టును ఆశిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఏఐసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న మాజీ ఎంపీ మధుయాష్కీ‌గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, షబ్బీర్ అలీతో పాటు అద్దంకి దయాకర్ పేర్లు ఈ రేసులో వినిపిస్తున్నాయి.

సీఎంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ చీఫ్‌గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంటుందన్నది పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ మహిళా కోటాలో సీతక్క పేరును రాష్ట్ర నేతలు ఏఐసీసీకి ప్రతిపాదించినా, హైకమాండ్ ఖరారు చేసినా ఆదివాసీ మహిళా అయినందును ఆమె నాయకత్వం వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లకు సాధ్యపడకపోవచ్చు. మరి తనకు నమ్మకస్తురాలైన సీతక్కకు పీసీసీ పదవి అప్పగించేలా చేసి ఇటు ప్రభుత్వాన్ని.. అటు పార్టీని రేవంత్ రెడ్డి తన గ్రిప్‌లో పెట్టుకుంటారో లేదో త్వరలోనే తేలిపోనుంది.

 
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.