close
Choose your channels

ఆ విష‌యంలో..సుడిగాడు త‌ర్వాత సెల్ఫీరాజా - అల్ల‌రి న‌రేష్

Tuesday, July 19, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లరి నరేష్‌, సాక్షిచౌదరి, కామ్నారనావత్ హీరో, హీరోయిన్లుగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సెల్ఫీరాజా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లి. సుంకర రామబ్రహ్మం సమర్పణలో గోపి ఆర్ట్స్‌ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన సెల్ఫీరాజా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన‌ సక్సెస్ మీట్ లో...

అల్లరి నరేష్ మాట్లాడుతూ...ఈ సినిమా గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 4న స్టార్ట‌య్యింది. ఆరోజు నుండి క‌థ ఎలా ఉంది. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఎలా వ‌ర్క్ చేస్తున్నారు.?. అంతా అనుకున్న బ‌డ్జెట్ లో పూర్తవుతుందా..? లేదా..? అనే ఆలోచ‌న‌ల‌తో చిన్న‌పాటి టెన్ష‌న్ ఉండేది. ఈ టెన్ష‌న్ తోనే సినిమా రిలీజ్ వ‌ర‌కు అన్నీ క‌రెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూసుకునేవాడిని. మా టీం అంద‌రి ఎనిమిది నెల‌ల క‌ష్టం ఈ స‌క్సెస్ రూపంలో క‌న‌ప‌డుతుంది. మా సినిమా ఇంత క‌లెక్ట్ చేసింది. అంత క‌లెక్ట్ చేసింద‌ని చెప్ప‌ను కానీ... నాకు సుడిగాడు సినిమా త‌ర్వాత ఆ రేంజ్ క‌లెక్ష‌న్స్ తెచ్చి పెట్టిన సినిమా ఈ సెల్ఫీరాజా. ముఖ్యంగా సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్‌, ఎగ్జిబిట‌ర్‌తో పాటు సినిమా చేసిన నిర్మాత కూడా బావుండాలి అని నాన్న‌గారు ఎప్పుడూ అనేవారు. ఈ సినిమా విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్ నాకు ఫోన్ చేసి సినిమా చాలా బావుంద‌ని... మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయ‌ని చెప్ప‌డం

చాలా హ్యాపీగా అనిపించింది. ద‌ర్శ‌కుడు ఈశ్వ‌ర్‌రెడ్డి సినిమాను చెప్పిన‌ట్టుగా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. శ్రీధ‌ర్ సీపాన‌, డైమండ్ ర‌త్న‌బాబు, సినిమాటోగ్రాఫ‌ర్ లోక‌నాథ‌న్‌గారు, పృథ్వీగారు, అజ‌య్‌ఘోష్‌గారు ఇలా యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. మ‌రో విష‌యం ఏమిటంటే... గ‌జ‌దొంగ వంటి ఎన్నో మంచి హిట్ చిత్రాల‌ను నిర్మించిన గోపి ఆర్ట్స్ బ్యాన‌ర్‌, చాలా గ్యాప్ త‌ర్వాత నిర్మించిన ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించ‌డం ఆనందంగా ఉంది. సెల్ఫీరాజా స‌క్సెస్ కి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్ అన్నారు.

డైరెక్ట‌ర్ ఈశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ...రెండేళ్ళ గ్యాప్ త‌రువాత‌ నేను న‌రేష్ గారితోనే సినిమా చేశాను. అయినా..నాలో చిన్న టెన్ష‌న్ ఉండేది. సినిమా రిలీజ్ త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు గారు, నితిన్‌ గారు నాకు ఫోన్ చేసి సెల్ఫీరాజా తో స‌క్సెస్ కొట్టావ‌ని చెప్ప‌డంతో ధైర్యం వ‌చ్చింది. నాపై న‌మ్మ‌కంతో నాతో సినిమా చేసిన న‌రేష్ కి థాంక్స్‌. ఆయ‌న ఈ సినిమాతో నాకు మ‌రో హిట్ అందించారు. ఆయ‌న ఒప్పుకుంటే ఆయ‌న‌తో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయ‌డానికి నేను ఎప్పుడైనా సిద్ధ‌మే. సాయికార్తీక్ సిట్యూవేష‌న్ త‌గ్గ‌ట్టు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు అన్నారు.

డైమండ్ ర‌త్నం మాట్లాడుతూ...ఈ చిత్రంలో పృథ్వీ, తాగుబోతు ర‌మేష్ కామెడి చ‌క్క‌గా పండింది. మాస్ ఆడియెన్స్‌కు బాగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాకు ముందు స్పూఫ్‌లు చేయ‌ని న‌రేష్ గారు ఈ సినిమాకు అవ‌స‌ర‌మ‌ని స్పూఫ్‌లు చేశారు. అవి ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కామ్నా రనావత్, నిర్మాత చలసాని రామబ్రహ్మం చౌదరి, పృథ్వీ, అజయ్ ఘోష్, వెంకట్రాజు, అప్పారావు, రాకెట్ రాఘవ, రచ్చ రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.