close
Choose your channels

SRK-Sandeep Reddy:ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్.. ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి..

Wednesday, February 21, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల(Dadasaheb phalke film festival) వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. గతేడాది విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి 'యానిమల్' చిత్రానికి ఉత్తమ దర్శకడు అవార్డు అందుకున్నాడు. ఇదే సినిమాలో నటించిన బాబీ డియోల్ ఉత్తమ విలన్‌గా అవార్డు అందుకున్నాడు. ఇక 'జవాన్' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, ఉత్తమ నటిగా నయనతార ఎంపికయ్యారు. ఈ అవార్డులు దక్కడం పట్ల విజేతలు తమ సంతోషం వ్యక్తం చేశారు.

అవార్డుల లిస్టు ఇదే..

ఉత్తమ నటుడు- షారుఖ్‌ ఖాన్ (జవాన్)

ఉత్తమ నటి- నయనతార (జవాన్)

ఉత్తమ దర్శకడు- సందీప్ రెడ్డి (యానిమల్‌)

ఉత్తమ నటుడు(నెగెటివ్‌ రోల్‌)- బాబీ డియోల్‌ (యానిమల్‌)

క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌)

ఉత్తమ గీత రచయిత - జావేద్‌ అక్తర్‌ ( నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ)

ఉత్తమ సంగీత దర్శకుడు - అనిరుధ్‌ రవిచందర్‌

ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌(Male) - వరుణ్‌ జైన్‌

ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌(Female) - శిల్పా రావు

ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ - యేసుదాసు

ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ

టెలివిజన్‌ విభాగం:

టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌- ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌

ఉత్తమ నటుడు- నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌)

ఉత్తమ నటి- రూపాలీ గంగూలీ (అనుపమ)

వెబ్‌సిరీస్‌ విభాగం:

క్రిటిక్స్‌ ఉత్తమ నటి- కరిష్మా తన్నా (స్కూప్‌)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.