Dunki 1st Day Collections: షారుఖ్‌కు భారీ షాక్.. దారుణంగా 'డంకీ' తొలిరోజు వసూళ్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) హీరోగా రాజ్ కుమార్ హిరాణి(Rajkumar Hirani) దర్శకత్వంలో గురువారం విడుదలైన 'డంకీ' సినిమాకు షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. అయితే హిందీలోనే రిలీజ్ కావడంతో సౌత్ ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి చూపించలేదు. దానికి తోడు సినిమా మొత్తం ఎమోషనల్ డ్రామా కావడంతో తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీని ప్రభావం మూవీ వసూళ్లపై పడింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.70 కోట్ల వరకు మాత్రమే గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక ఇండియాలో అయితే కేవలం రూ.60 కోట్ల గ్రాస్ అంటే దాదాపు రూ.30 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు క్రిటిక్స్ చెబుతున్నారు.
షారుఖ్ గత రెండు సినిమాలు(పఠాన్, జవాన్) ఓవరాల్‌గా రెండు చిత్రాలు రూ.1000 కోట్లు రాబట్టి షారుఖ్ స్టామినా తెలియజేశాయి. జవాన్ విడుదలైన తొలిరోజే రూ.75 కోట్ల షేర్ వసూలు చేయగా.. పఠాన్ రూ.57 కోట్లు వసూలు చేసింది. ఇక ఇటీవల విడుదలైన యానిమల్ తొలిరోజు వసూళ్లు రూ.63.8 కోట్లు కాగా.. టైగర్- 3 కలెక్షన్స్ రూ.43 కోట్లు వచ్చాయి. ఆదిపురుష్ చిత్రం కూడా తొలిరోజు రూ.36 కోట్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాల కంటే 'డంకీ' తక్కువ వసూళ్లు రాబట్టడం గమనార్హం.
మరోవైపు ఇవాళ విడుదలైన ప్రభాస్ 'సలార్' దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్‌తో దుమ్మురేపుతోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.45.34 కోట్లు సలార్ రాబట్టింది. ఇక మూవీ బ్లాక్‌బాస్టర్ కావడంతో మొదటిరోజు వసూళ్లు రూ.100కోట్లకు పైగా వస్తాయని భావిస్తున్నారు. ఓవైపు సలార్ చిత్రం దూసుకుపోవడంతో డంకీ కలెక్షన్స్ మరింత పడిపోయే అవకాశముంది. దీంతో ఈ మూవీతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతామనుకున్న షారుఖ్ ఆశలు గల్లంతైనట్లేనని చెబుతున్నారు. మొత్తానికి క్రిస్మస్ పోరులో ప్రభాస్ ఘన విజయం సాధించాడని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments