close
Choose your channels

నాలాగా ఎవరూ మోసపోకండి.. బయోపిక్‌పై షకీలా స్పందన

Sunday, December 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాలాగా ఎవరూ మోసపోకండి.. బయోపిక్‌పై షకీలా స్పందన

దక్షిణాదిన సిల్క్‌ స్మిత తర్వాత శృంగార తార పేరు తెచ్చుకుని, సూపర్‌స్టార్‌ రేంజ్‌ చేరుకున్న నటి షకీలా. ఇప్పుడు ఈమె బయోపిక్‌ను 'షకీలా' పేరుతో రూపొందింది. రిచా చద్దా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇంద్రజీత్‌ లంకేశ్‌ తెరకెక్కించారు. ప్యాన్‌ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి షకీలా మాట్లాడుతూ "నా బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రజీత్‌, నిర్మాతలకు ధన్యవాదాలు. నా వ్యక్తిగత సమస్యల గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. మన అందరికీ జీవితంలో ఎన్నో బాధలుంటాయి. వాటిని ఎదుటివారు అర్థం చేసుకోలేకపోవచ్చు.

మన గురించి, మన వెనుక తప్పుగానూ మాట్లాడుతారు. అలాంటి వారి గురించి నేను మాట్లాడను. నేను చెప్పేదొక్కటే సినిమా పరిశ్రమలోని మహిళలైన, చదువుకునే అమ్మాయిలైనా.. నాలాగా మోసపోకండి. నాకు రావాల్సిన గౌరవం రాలేదనే అనుకుంటున్నాను. షకీలా సినిమా మహిళలకు ఓ సందేశాన్ని అందించే చిత్రమని సంతోషంగా చెప్పగలను" అన్నారు. నేను బతికుండగానే నా బయోపిక్‌ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని కూడా షకీలా అన్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.