close
Choose your channels

Sharmila :తన చెడు కోరుకుంటున్నారా..? సీఎం జగన్‌ టార్గెట్‌గా షర్మిల విమర్శలు..

Wednesday, February 7, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తన భద్రతపై సీఎం జగన్‌ టార్గె్‌ట్‌గా మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తనకు చెడు జరగాలని కోరుకుంటున్నారా? ఏదైనా ప్రమాదం జరగాలని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. బాపట్లలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడారు.

"ఒకరేమో కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు. ఒకరేమో కుర్చీ ఎలా సంపాదించాలి అనే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజల గురించి ఏ ఒక్కరికీ అటు చంద్రబాబుకి ఇటు జగన్ మోహన్ రెడ్డికి అవసరం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కళ్లు తెరవాలి. ఈ బీజేపీ తొత్తు పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేనలను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యపడుతుంది" అని తెలిపారు.

"అలాగే తన భద్రత గురించి మాట్లాడుతూ "నేను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేమీ పట్టనట్లు, ఒక మహిళ అని కూడా చూడకుండా, ఓ పార్టీకి అధ్యక్షురాలిని అని కూడా పట్టించుకోకుండా.. ఇవాళ మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే.. మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ఇది ప్రజాస్వామ్యం అన్న ఆలోచన ఉందా? గుర్తుందా?" అని ప్రశ్నించారు.

"మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడీలు కట్టుకుని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్లకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే.. మా చెడు కోరుకుంటున్నారు అనే కదా దాని అర్థం. మాకు ఏదైనా ప్రమాదం జరగాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కలిపించే వాళ్లలో కూడా మీ వాళ్లు ఉంటారనే కదా అర్థం. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?" అంటూ మండిపడ్డారు.

"రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు.. ఐదు సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ఒక్కరూ రాష్ట్రం గురించి ఆలోచించలేదు. వాళ్ల స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. ఈ సారైనా సరే అసెంబ్లీ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల తీర్మానాన్ని ప్రజల కోసం పాస్ చేయాలి. ఆంధ్రకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఎందుకు ద్రోహం చేసింది.. పోలవరం ఎందుకు ద్రోహం చేసింది.. వీటన్నిటి గురించి అసెంబ్లీలో చర్చలు జరిగి తీర్మానాన్ని రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలి" అని షర్మిల డిమాండ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.