close
Choose your channels

Shivam Bhaje:'శివం భజే' పవర్ ఫుల్ టీజర్ విడుదల!!

Wednesday, June 19, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం 'శివం భజే'. ఇదివరకే టైటిల్, ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్ నేడు విడుదలై అమాంతం అంచనాలను పెంచేసింది. అప్సర్ దర్శకత్వంలో న్యూ ఏజ్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్ , యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ కూడా ఉన్నట్టు టీజర్ లో తెలుస్తుంది.

హీరో అశ్విన్ కి ఏదో మానసిక సమస్య ఉన్నట్టు బ్రహ్మాజీ, హైపర్ ఆది లతో చెప్పడం, ఇన్వెస్టిగేషన్ లో బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, సాయి ధీన వంటి పలువురు నటులు నిమగ్నమై ఉండడం, అయ్యప్ప శర్మ ద్వారా వీటన్నిటి వెనక దైవం ఉనికి ఉందని తెలియజేయడం, అశ్విన్ బాబు రౌద్ర రూపంలో రౌడీలను శూలంతో ఎత్తి పడేయడం... అన్నిటినీ మించి చివరగా అదిరిపోయే సీజీ విజువల్స్ లో దాచిన శివుడి దర్శనం, దానికి వికాస్ బడిస బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ ఇస్తాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలోతెరకెక్కుతున్న చిత్రం 'శివం భజే'. కొత్త కథ, కథనాలకి తగ్గట్టుగా నటులు, సాంకేతిక విలువలు సమకూర్చుకున్నాము. టైటిల్, ఫస్ట్ లుక్ కి మించిన స్పందన ఇప్పుడు టీజర్ కి రావడం చాలా ధైర్యన్నిస్తుంది. మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్ కూడా ఈ చిత్ర విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో ఎక్కడా తగ్గకుండా వినూత్నంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర నిర్మాణాంతర కర్యక్రమాలు వేగంగా పూర్తి చేసుకుని జులైలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా సంతోషంగా ఉంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు.

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, " 'శివం భజే' టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించిన మా చిత్ర టీజర్ కి అన్ని భాషల ప్రేక్షకులు, వీక్షకుల నుండి అనూహ్యమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మా నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి గారి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది. మా పాటలు, ట్రైలర్, విడుదల తేదీ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ, "మా 'శివం భజే' టీజర్ కి వచ్చే అనూహ్య స్పందనకి అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా సస్పెన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో పాటు డివోషన్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. మా దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి గారు ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అన్నారు.

నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment
Comment