close
Choose your channels

'దళపతి' లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోషల్ సాంగ్

Wednesday, August 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

26 ఏళ్ల క్రితం ద‌క్షిణాదిలో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన చిత్రం `ద‌ళ‌ప‌తి`. సూప‌ర్ స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, మ‌మ్ముట్టి కాంబినేష‌న్‌లో విడుద‌లైన ద‌ళ‌ప‌తి తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో తెలుగులో మ‌రో సినిమా విడుద‌ల‌వుతుంది. ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం 'దళపతి`. సదా - కవితా అగర్వాల్ , బాబు - ప్రియాంక శర్మ రెండు జంటలుగా న‌టిస్తున్నారు.

ఈ సినిమాకు యాజ‌మాన్య సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ జ‌రుపుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాలో ఓ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేమా ఘోష‌ల్ పాడారు. సెల‌క్టివ్‌గా పాట‌లు పాడు శ్రేయా ఘోష‌ల్ తెలుగులో ఏడాది త‌ర్వాత పాడుతున్న పాట ఇది. `నీకు నాకు మ‌ధ్య ఏదో ఉందే...` అంటూ సాగే ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్‌, యాజ‌మాన్య క‌లిసి ఆల‌పించారు. ఈ పాట‌ను ఎఫ్‌.ఎం రేడియోలో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఈ సందర్బంగా దర్శకులు సదా మాట్లాడుతూ.. ``పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా పాటల రికార్డింగ్ జ‌ర‌గుతుంది. ఓ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్‌, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రేయో ఘోష‌ల్ పాడారు. ప‌రిమితంగా పాట‌లు పాడే శ్రేయోఘోష‌ల్‌గారు మా సినిమాలో పాడ‌టం ఆనందంగా ఉంది. మా యూనిట్‌ను ఆమె అభినందించారు. పాట‌ల‌న్నీ చాలా బాగా వచ్చాయి. యాజ‌మాన్య‌గారి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. అలాగే ఛాయాగ్రాహకులు జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది`` అన్నారు

నిర్మాత బాబురావు మాట్లాడుతూ..`అడ‌గ్గానే మా సినిమాలో పాట పాడ‌టానికి ఒప్పుకుని పాడిన శ్రేయా ఘోష‌ల్ గారికి థాంక్స్‌. పాట చాలా బాగా వ‌చ్చింది. ముఖ్యంగా శ్రేయా పాడిన పాట‌ను యూ ట్యూబ్ చానెల్స్‌లో విడుద‌ల చేశాం. ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సినిమా మేం అనుకున్న‌ట్లు వ‌స్తుంది. యాజమాన్య సంగీతం, జై సినిమాటోగ్ర‌ఫీ, స‌దా డైరెక్ష‌న్ ప్రేక్షకులను అలరించడం ఖాయం`` అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.