close
Choose your channels

సమరసింహారెడ్డి, ఇంద్ర తరహాలో ఉండే యాక్షన్ లవ్ స్టోరీ సిద్ధార్ధ - హీరో సాగర్

Monday, August 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. దాస‌రి కిర‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న‌ సిద్దార్థ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈనెల 16న సాగ‌ర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సాగ‌ర్ చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ...అంద‌రికీ న‌చ్చే ఓ మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నే ఉద్దేశ్యంతో ఓ 50 క‌ధ‌లు విన్నాం. అందులోంచి ఈ చిత్ర‌ క‌థ‌ను సెలెక్ట్ చేసాం. రైట‌ర్ విసు ఈ క‌థ‌ను అందించారు. సిధ్ధార్ధ్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర జానీ చిత్రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కో - డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేసిన ద‌యానంద రెడ్డి తెర‌కెక్కించారు.
అనంత‌పూర్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే యాక్ష‌న్ ల‌వ్ స్టోరీ ఇది. మ‌లేషియాలో 25 రోజులు షూటింగ్ చేసాం. ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాల‌తో ఈ చిత్రం రూపొందింది. షూటింగ్ పూర్త‌య్యింది ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈనెలాఖ‌రున ఆడియోను, సెప్టెంబ‌ర్ లో సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. స‌మ‌ర‌సింహారెడ్డి, ఇంద్ర త‌ర‌హాలో ఉండే క‌థతో సినిమా చేసే అవ‌కాశం నా కెరీర్ బిగినింగ్ లోనే రావ‌డం చాలా ఆనందంగా ఉంది.
ఈ చిత్రానికి సంగీతం మ‌ణిశ‌ర్మ గారు.. సినిమాటోగ్ర‌ఫీని ఎస్.గోపాల్ రెడ్డి ఇలా టాప్ టెక్నీషియ‌న్స్ తో ఏమాత్రం రాజీప‌డ‌కుండా దాస‌రి కిర‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నుంచి హీరోగా న‌టిస్తూనే మంచి క్యారెక్ట‌ర్స్ వ‌స్తే చేయాల‌నుకుంటున్నాను. అలాగే ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేసి సీరియ‌ల్స్ నిర్మించాల‌నుకుంటున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.