close
Choose your channels

ఆ ఆలోచ‌న నుంచి పుట్టికొచ్చిందే సిద్దార్ధ - సాగ‌ర్

Tuesday, September 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కించారు. దాస‌రి కిర‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సిద్దార్థ చిత్రం ఈనెల 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా సాగ‌ర్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

16న సిద్దార్ధ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు క‌దా..రిజ‌ల్ట్ గురించి టెన్ష‌న్ ప‌డుతున్నారా..?

అంద‌రికీ న‌చ్చే ఓ మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నే ఉద్దేశ్యంతో 3 సంవ‌త్స‌రాలు వెయిట్ చేసి ఈ క‌థ‌ను సెలెక్ట్ చేసాం. ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. అందుచేత రిజ‌ల్ట్ విష‌యంలో ఎలాంటి టెన్ష‌న్ లేదు. 100% స‌క్సెస్ సాధిస్తామ‌నే కాన్పిడెన్స్ ఉంది.

సిద్దార్ధ్ కాన్సెప్ట్ ఏమిటి..?

అనంత‌పూర్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే యాక్ష‌న్ ల‌వ్ స్టోరీ ఇది. ఈ చిత్రంలో నేను జాబ్ చేస్తుంటాను. నా ప‌ని ఏదో అది చేసుకుంటుంటాను. అయితే....ఊహించ‌ని సంఘ‌ట‌న వ‌ల‌న నేను యాక్ష‌న్ లో దిగ‌వ‌ల‌సి వ‌స్తుంది. నా ఆలోచ‌నా విధానం మార‌డానికి కార‌ణం ఏమిటి..? ఆత‌ర్వాత ఏం జ‌రిగింది..? అనేది కాన్సెప్ట్.

డైరెక్ట‌ర్ ద‌యానంద‌రెడ్డి గురించి చెప్పండి..?

డైరెక్ట‌ర్ ద‌యానంద‌రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర జానీ చిత్రం నుంచి స‌ర్ధార్ వ‌ర‌కు కో - డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేసారు. ఈ మూవీని క‌థ‌గా చెప్పిన దానికంటే చాలా బాగా తెర‌కెక్కించారు. యాక్ష‌న్, ఎంట‌ర్ టైన్మెంట్, సెంటిమెంట్...ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాల‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా మా అంద‌రికీ మంచి పేరు తీసుకువ‌స్తుంది.

మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ సినిమాలో చిన్న క్యారెక్ట‌ర్ చేసారు. ఆత‌ర్వాత మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ లో న‌టించి త‌ప్పు చేసాను అన్నారు కార‌ణం..?

మొగ‌లిరేకులు సీరియ‌ల్ ద్వారా నాకు మంచి గుర్తింపు వ‌చ్చింది. అయితే...మంచి రోల్ చేయాల్సిన నేను చిన్న క్యారెక్ట‌ర్ ని ఎంచుకోవ‌డం అనేది స‌రైన నిర్ణ‌యం కాద‌ని నా ఫీలింగ్. అందుకే అలా అన్నాను. ఆ ఆలోచ‌న నుంచి పుట్టికొచ్చిందే నేను హీరో అవ్వడం అనేది.

సీరియ‌ల్, సినిమా రెండింటిలో న‌టించారు క‌దా...! రెండింటికీ మీరు గ‌మ‌నించిన తేడా ఏమిటి..?

నాకు రెండిండికి పెద్ద‌గా తేడా ఏమీ క‌నిపించ‌లేదు.

సిద్దార్ధ ట్రైల‌ర్ చూస్తుంటే మీరు మాస్ హీరోగా గుర్తింపు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు అనిపిస్తుంది..?

మాస్ హీరో, క్లాస్ హీరో అని కాదు. ప‌ర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మంచి పాత్ర‌లు చేయాలి అనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు రావాలి అనుకుంటున్నాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?

హ‌రి అనే మూవీ చేస్తున్నాను. ఈ చిత్రంలో పోలీస్ గా న‌టిస్తున్నాను. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వర‌లో తెలియ‌చేస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.