close
Choose your channels

మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం, స్నేహా ఉల్లాల్ ఫోటోలు వైరల్

Saturday, October 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం, స్నేహా ఉల్లాల్ ఫోటోలు వైరల్

నీలిరంగు కళ్లు, వైట్ స్కిన్ టోన్, కట్టిపడేసే చిరునవ్వుతో జూనియర్ ఐశ్వర్యరాయ్‌గా గుర్తింపు తెచ్చుకుంది స్నేహా ఉల్లాల్. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన స్నేహకు ఆ సినిమా విజయం సాధించడంతో అవకాశాలు క్యూ కట్టాయి. ‘నేను మీకు తెలుసా’, ‘కరెంట్‌’, ‘వరుడు’, ‘సింహా’.. ఇలా స్టార్ హీరోలతతో నటించినప్పటికీ ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. 2014లో వచ్చిన ‘అంతా నీ ఇష్టం’ స్నేహా ఉల్లాల్ చివరి తెలుగు చిత్రం. గతేడాది ‘ఎక్స్‌పైరీ డేట్‌’ అనే వెబ్‌సిరీస్‌తో ఆమె ప్రేక్షకులను అలరించారు.

మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం, స్నేహా ఉల్లాల్ ఫోటోలు వైరల్

ఇప్పుడు ఈమె గురించి డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే... దసరా పర్వదినం కావడంతో సినీ తారలు, సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే స్నేహా ఉల్లాల్ కూడా సంప్రదాయబద్దంగా చీర కట్టుకుని, చేతిలో దీపంతో విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఏముంది అనుకోకండి.. ఇక్కడే అసలు ట్విస్ట్ వుంది. ఆ ఫొటోల్లో స్నేహా ఉల్లాల్ మెడలో మంగళసూత్రం.. నుదుటిన సింధూరంతో కనిపించారు. వాటిన చూసిన నెటిజన్లు ‘మేడమ్‌ మీకు పెళ్లి ఎప్పుడు అయ్యింది?’ కనీసం మాట కూడా చెప్పలేదే అంటూ ఆమెను క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన స్నేహా ఉల్లాలు.. మీరు అనుకుంటున్నట్లుగా తనకు పెళ్లి కాలేదని, ఓ యాడ్‌ షూట్‌ కోసమే మెడలో మంగళసూత్రం ధరించానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని స్నేహా క్లారిటీ ఇచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.