close
Choose your channels

'స్పీడున్నోడు' శ్రీనివాస్ ఎనర్జీకి సరిపోయే టైటిల్ - వెంకటేష్

Sunday, January 31, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనారిక జంట‌గా గుడ్ విల్ సినిమా బ్యాన‌ర్‌పై భీమ‌నేని రోషితా సాయి స‌మ‌ర్ప‌ణ‌లో భీమ‌నేని సునీత నిర్మించిన చిత్రం స్పీడున్నోడు. ఈ చిత్రం ఫిభ్ర‌వ‌రి 5న విడుద‌ల‌వుతుంది. డి.జె.వసంత్ సంగీతం అందించిన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన ప్లాటినం డిస్క్ వేడుక‌లో....

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ``శ్రీనివాస్‌లో మంచి ఎనర్జీ ఉంది. అల్లుడు శీను సినిమాలో త‌న ఎఫ‌ర్ట్ నాకు బాగా నచ్చింది. ఎగ్రెసివ్ ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ త‌నయుడుగా త‌న‌కి మంచి ఫ్యూచ‌ర్ ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను``అన్నారు.

వెంక‌టేష్ మాట్లాడుతూ ``కొంద‌రికి మాత్ర‌మే కుదిరే టైటిల్‌. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా నుండి మంచి స్పీడును చూపించాడు. శ్రీనివాస్ డేడికేష‌న్‌, వ‌ర్క్ గురించి అంద‌రూ చెప్పారు. త‌న‌కు స‌రిపోయే టైటిల్‌. భీమ‌నేని అంద‌రి నుండి త‌న‌కు కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకుంటాడు. సినిమా పెద్ద హిట్ కావాలి``అన్నారు.

ప్ర‌కాష్ రాజ్ మాట్లాడుతూ ``అల్లుడు శీనులో సాయితో ప‌నిచేశాను. చాలా సెన్సిటివ్‌గా ఆలోచించే కుర్రాడు. ఈ సినిమాలో చాలా ప‌రిణితిని క‌న‌ప‌రిచాడు. ఇక భీమ‌నేని గురించి చెప్పాలంటే ఆడియెన్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

భీమ‌నేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ``మంచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని సినిమా చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల రెండు, మూడేళ్ళ‌కు ఒక సినిమా చేయాల్సి వ‌స్తుంది. నేను ప‌డుతూ, లేస్తూ సినిమాలు చేస్తూ వ‌చ్చాను. నేను ఇప్ప‌టి ట్రెండ్‌కు, టెక్నాల‌జీకి స‌రిపోయే విధంగా సినిమా తీశానని చెప్ప‌డానికి స‌మాధామ‌నే ఈ చిత్రం. నేను ఇలా అప్‌డేట్ కావ‌డానికి రాజ‌మౌళి, రాజుహిరాణి ఇద్ద‌రే కార‌ణం. ఫుల్ ఎఫ‌ర్ట్ పెట్టి తీస్తే సినిమా తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళ‌వ‌చ్చున‌ని రాజ‌మౌళి ప్రూవ్ చేశాడు. అలాగే రేపు నేను నా సినిమాను చూసి నా పిల్ల‌లు గ‌ర్వ‌పడేలా ఉండాల‌ని అనుకుంటున్నాను. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే సాయిశ్రీనివాస్ క‌థ విన‌గానే చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో చేస్తాన‌ని అన్నాడు. చాలా డేడికేష‌న్‌తో వ‌ర్క్ చేశాడు. మంచి మెచ్యూరిటీ ఉన్న హీరో ఫ్యూచ‌ర్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అవుతాడు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చేలా ట్రెండీగా ఉంటుంది.వ‌సంత్ సుడిగాడు త‌ర్వాత అనుకున్న స్థాయిలో ఈ సినిమాతో పేరు తెచ్చుకుంటాడు. మూడేళ్ళు ఈ సినిమా కోసం నాతోనే ట్రావెల్ చేశాడు. విజ‌య్ ఉల‌గ‌నాథ‌న్ మంచి సినిమాటోగ్ర‌ఫీ అందించాడు`` అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ``మంచి ఎఫ‌ర్ట్‌తో ఈ సినిమాకు ప‌నిచేశాం. డి.జె.వ‌సంత్‌, విజ‌య్ ఉల‌గ‌నాథ‌న్ గారు ఎక్స‌లెంట్ అవుట్‌పుట్ ఇచ్చారు. అలాగే వివేక్ కూచిబొట్ల ఇలా అంద‌రూ ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది`` అన్నారు.

డి.జె.వ‌సంత్ మాట్లాడుతూ ``పాట‌ల ర‌చ‌యిత‌లు, సింగ‌ర్స్ వ‌ల్ల పాట‌లు ఇంకా బాగా వ‌చ్చాయి. మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా ఇంకా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో పోకూరి బాబూరావు, మ‌ధునంద‌న్‌, శ్రీనివాస‌రెడ్డి, బ్ర‌హ్మానందం, పృథ్వీ, అలీ, రావు ర‌మేష్‌, గౌతంరాజు, ప్ర‌వీణ్‌వ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

చిత్ర‌యూనిట్ స‌భ్యుల‌కు నాగార్జున‌, వెంక‌టేష్‌, ప్ర‌కాష్ రాజ్ ప్లాటిన‌మ్ డిస్క్ షీల్డ్స్‌ను అందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.