close
Choose your channels

బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా స్పీడున్నోడు టీజర్ రిలీజ్..

Sunday, January 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం స్పీడున్నోడు. గుడ్ విల్ సినిమా బ్యాన‌ర్ పై భీమ‌నేని శ్రీనివాస‌రావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్పీడున్నోడు టీజ‌ర్ లాంఛ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా ...

డైరెక్ట‌ర్ భీమ‌నేని శ్రీనివాస‌రావు మాట్లాడుతూ...త‌మిళ్ లో విజయం సాధించిన సుంద‌ర‌పాండ్య‌న్ సినిమాకి రీమేక్ గా స్పీడున్నోడు సినిమా చేసాం. ఐదు రోజుల టాకీ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. సంక్రాంతికి ఆడియో రిలీజ్ చేసి, ఫిబ్ర‌వ‌రి మొద‌టివారంలో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. నా సినిమాల్లో సుస్వాగ‌తం, సూర్య‌వంశం బెస్ట్ మూవీస్. ఈ సినిమా కూడా నా కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒక‌టిగా నిలుస్తుంది. సుడిగాడు సినిమా త‌ర్వాత మూడు సంవ‌త్స‌రాలు గ్యాప్ వ‌చ్చింది. ఎంత గ్యాప్ వ‌చ్చిన ఫ‌ర‌వాలేదు మంచి సినిమా చేయాల‌నే ఉద్దేశ్యంతో ఎంతో త‌పించి ఈ సినిమాని తీసాను.

మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేసాం. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త‌న తొలి చిత్రం అల్లుడు శీను తో డాన్స్, ఫైట్స్ బాగా చేస్తాడ‌నే పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మంచి న‌టుడు అనే పేరు వ‌స్తుంది. ఫ‌ర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర‌కి శ్రీనివాస్ పూర్తి న్యాయం చేసాడు. 10, 15 సినిమాలు చేసిన ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న హీరో ఎలా న‌టిస్తాడో అలా న‌టించాడు. క్లైమాక్స్ లో శ్రీనివాస్ న‌ట‌న హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకి వ‌సంత్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్ట‌ర్ వ‌సంత్ కి చాలా మంచిపేరు వ‌స్తుంది ఖ‌చ్చితంగా స్పీడున్నోడు హిట్ అవుతుంది అన్నారు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ...సుంద‌ర‌పాండ్య‌న్ సినిమా చూసాను. ఈ సినిమాలో క‌థ నాకు బాగా న‌చ్చింది. అందుక‌నే భీమ‌నేని గారు సుంద‌ర‌పాండ్య‌న్ రీమేక్ చేద్దామంటే ఓకె చెప్పాను. వసంత్ అద్భుత‌మైన ట్యూన్స్ అందించారు. టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేసాం. స్పీడున్నోడు అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వివేక్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ వ‌సంత్, చైత‌న్య క్రిష్ణ‌, మ‌ధు, కెమెరామెన్ విజ‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.