close
Choose your channels

శ్రీదివ్యకి అప్పుడలా..ఇప్పుడిలా..

Thursday, May 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగమ్మాయి శ్రీ‌దివ్య టాలీవుడ్ లో కంటే కోలీవుడ్‌లోనే బిజీగా మారింది. వారం రోజుల గ్యాప్‌లో ఈ ముద్దుగుమ్మ న‌టించిన రెండు సినిమాలు విడుద‌లకు సిద్ధ‌మ‌వ‌డం ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. జీవీ ప్ర‌కాష్‌తో శ్రీ‌దివ్య క‌లిసి న‌టించిన హై స్కూల్ థ్రిల్ల‌ర్ 'పెన్సిల్' ఈ నెల 13న విడుద‌ల కానుంటే.. విశాల్‌తో ఆడిపాడిన 'మ‌రుదు' (తెలుగులో 'రాయుడు') ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ రెండు చిత్రాలు అదే స‌మ‌యంలో రిలీజ్ కాబోతున్నాయి.

ఈ రెండు చిత్రాల‌తో త‌మిళంతో పాటు తెలుగులోనూ త‌న మార్కెట్ పెరుగుతుంద‌ని ఈ అమ్మ‌డు భావిస్తోంది. విశేష‌మేమిటంటే.. గ‌త వేస‌వి ప్రారంభంలో 'వార‌ధి', చివ‌ర‌లో 'కేరింత' అనే రెండు సినిమాల‌తో డ‌బుల్ ధ‌మ‌కా సంద‌డి చేసిన శ్రీ‌దివ్య‌, ఈ వేస‌వికి రెండు త‌మిళ చిత్రాల‌తో డ‌బుల్ ధ‌మ‌కా ఇవ్వ‌నుండ‌డం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.