close
Choose your channels

విడుదలకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ చిత్రం రా..రా...

Saturday, May 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. జూన్ నెల ప్రథమార్ధం లో విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ .. ' ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. 'రా..రా 'చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.

మా హీరో, మిత్రుడు శ్రీకాంత్ తో రూపొందిస్తున్న 'రా..రా' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవల మెగాస్టార్ విడుదల చేసిన చిత్రం మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నెలలోనే చిత్రం టీజర్ ను ఓ ప్రముఖ కథానాయకుడు చేతులమీదుగా విడుదల చేయనున్నాము. అలాగే చిత్రం ఆడియో వేడుకను విభిన్న రీతిలో జరుపనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, వచ్చే నెలలో చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్' పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి నిర్మాత: విజయ్ దర్శకత్వం: విజి చరిష్ యూనిట్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.