close
Choose your channels

బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు - అల్లు శిరీష్

Wednesday, July 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు శిరీష్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. ఎస్.ఎస్.త‌మ‌న్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు అనే టైటిల్ సాంగ్ ను ఈరోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో అల్లు అర‌వింద్ రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ...సినిమా ఆడియోను కొత్త‌గా రిలీజ్ చేయాల‌నే ఉద్దేశ్యంతో ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఈ కొత్త ప‌ద్ద‌తిని స‌రైనోడు సినిమాతో ప్రారంభించాం. రేప‌టి నుంచి శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు పాట‌లు సోష‌ల్ మీడియాలో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన శ్రీరస్తు శుభ‌మ‌స్తు అనే సాంగ్ కాశ్మీర్ లో చిత్రీక‌రించాం. త‌ప్ప‌నిస‌రిగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆడియోను ఈనెల 31న‌, చిత్రాన్ని ఆగ‌ష్టు 5న రిలీజ్ చేయ‌నున్నాం అన్నారు.

డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ మాట్లాడుతూ...టైటిల్ సాంగ్ ఎంత ప్ల‌జెంట్ గా ఉందో...సినిమా కూడా అంతే ప్ల‌జెంట్ గా ఉంటుంది. ఆడియో & మూవీని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ...భ‌లే భ‌లే మ‌గాడివోయ్ తర్వాత మ‌రోసారి అవ‌కాశం ఇచ్చిన అల్లు అర‌వింద్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ప‌రుశురామ పెంటాస్టిక్ డైరెక్ట‌ర్..ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ మూవీలో నా క్యారెక్ట‌ర్ ఎంత‌గానో న‌చ్చింది. శిరీష్ ఈ మూవీ కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేసాడు. ఈ చిత్రం సూప‌ర్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ....ఓసారి ప‌రుశురామ్ ని క‌లిసి మీతో సినిమా చేయాల‌ని ఉంది చెప్పాను. ఎలాంటి క‌థ ఉండాల‌నుకుంటున్నారు అంటే...అంద‌రూ చేస్తున్న‌ట్టుగా కాకుండా స్ట్రాంగ్ స్టోరీ ఉండాలి అన్నాను. ఆత‌ర్వాత ఎంట‌ర్ టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోష‌న్స్...ఇలా అన్నీ ఉన్న ఓ బ‌ల‌మైన క‌థ‌ను చెప్పారు. నాకు బాగా న‌చ్చింది. ఫ్యామిలీ డ్రామా ఉన్న ల‌వ్ స్టోరీ ఇది. ఇక మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే...త‌మ‌న్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. ఈ చిత్రానికి మ్యూజిక్ చేయాల‌ని త‌మ‌న్ తో చెప్పిన‌ప్పుడు ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ సినిమాల‌కు మ్యూజిక్ అందించాను. ఇది ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ. సో...ఈ మూవీకి మ్యూజిక్ చేయ‌డం అంటే నాకు కొత్త‌గా..ఇంట్ర‌స్టింగ్ గా.. ఉంటుంద‌ని చెప్పాడు. త‌మ‌న్ అందించిన అన్ని పాట‌లు అంద‌రికీ న‌చ్చుతాయి అనుకుంటున్నాను. లావ‌ణ్య నేచుర‌ల్ ఆర్టిస్ట్. త‌ను న‌టించిన‌ట్టు అనిపించ‌దు ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు అనిపిస్తుంటుంది. కొత్త జంట త‌ర్వాత గీతా ఆర్ట్స్ లో నాకు మ‌రో అవ‌కాశం ఇచ్చిన మా నాన్న‌కు, బ‌న్ని వాసుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ చిత్రంలో నా వ‌ర్క్ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.